– మండల విద్యాశాఖ అధికారి యాప సాంబయ్య
నవతెలంగాణ – తాడ్వాయి
రేపటి నుండి 30వ తేదీ వరకు జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి యాప సాంబయ్య తెలిపారు. మండల విద్యా వనరుల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని అన్ని యజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 285 మంది 10వ తరగతి విద్యార్థులకు గాను, ఇందిరానగర్ జడ్.పి.హెచ్.ఎస్, మేడారం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రోజు విడిచి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులను ఎనిమిది గంటల 45 గంటల నుంచి పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారని, పరీక్ష సమయం పూర్తయిన తర్వాతే బయటకు పంపుతామని ఆయన స్పష్టం చేశారు. ఇందిరానగర్ హై స్కూల్ పరీక్షా కేంద్రంలో 117, మేడారం ఇంగ్లీష్ మీడియం పాఠశాల పరీక్షా కేంద్రంలో 168 పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరుకానున్నట్లు ఎంఈఓ యాప సాంబయ్య తెలిపారు. రెండు పరీక్షా కేంద్రాల్లో 18 మంది ఇన్విజిలేటర్లు నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షలు ప్రశాంతమైన వాతావరణం లో జరగడానికి అవసరమైన అన్ని వసతులు కల్పించడం జరిగిందని పరీక్ష కేంద్రాల వద్ద ఫర్నిచర్ ట్యూబ్ లైట్లు సీలింగ్ ఫ్యాన్లు మంచినీటి సౌకర్యం మూత్రశాలలు తదితర ఏర్పాట్లు చేసినట్లు ఎంఈఓ సాంబయ్య తెలిపారు. పరీక్షలు జరిగే అన్ని రోజులు పరీక్ష సమయాల్లో జిరాక్స్ సెంటర్లు నెట్ సెంటర్లు మూసి వేయించాలని తెలిపారు. విద్యార్థులందరూ సమయపాలన పాటించి పరీక్ష హాలుకు చేరుకొని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.