నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాలలో సోమవారం 10 పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలో గల జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో 220 మంది విద్యార్థులకు గాను 220 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 179 మంది విద్యార్థులకు గాను 178 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కేవలం ఒకే విద్యార్థిని పరీక్షకు హాజరు కాలేదని ఎంఈవో వెంకటేశం తెలిపారు. రెండు పరీక్ష కేంద్రాలలో 399 మంది విద్యార్థులకు గాను 398 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.