నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
18వ తేదీన ప్రారంభమైన పది పరీక్షలు నేటితో ముగిశాయి. నాగిరెడ్డిపేట మండలంలో రెండు కేంద్రాలలో పది పరీక్షలు నిర్వహించారు. జెడ్ పి హెచ్ స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రంలో 220 విద్యార్థులకు గాను 220 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 179 విద్యార్థులకు గాను ఒక్క 178 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగిందని ఎం ఈ వో వెంకటేశం తెలిపారు. మండల వ్యాప్తంగా 399 విద్యార్థులకు గాను 398 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఆయన తెలిపారు.