భరోసా దక్కితే…అదే పదివేలు.?

– అష్టకష్టాలు పడుతున్న కౌలు రైతులు
– వైఎస్సార్ హయాంలో గుర్తింపు కార్డుల పంపిణీ
– రైతు భరోసాలో చేర్చాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
వ్యవసాయం తప్ప ఇతర పని చేయలేరు. దీంతో కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నవారికి ఏ పథకమూ అందక అష్టకష్టాలు పడుతున్నారు.ఇప్పుడు వీరిని అదుకోనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  కౌలు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన నేపత్యాన వీరికి ఏ రూపంలో సాయం అందించాలనే అంశంపై అభిఫ్రాయ సేకరణ చేపట్టింది. తాజాగా రైతుభరోసా అమలుపై అధ్యయనం చేస్తున్న మంత్రివర్ల ఉపసంఘం కౌలు రైతులు ఏం కోరుకుంటున్నారో అరా తీస్తోంది. కొలు రైతులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.వారికి రైతు భరోసా అం దిస్తారా.. గుర్తింపు కార్డులు జారీచేస్తారా.. మరో దూపంలో సాయం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
“గుర్తింపు’ ఇచ్చిన వైఏస్
కొలు రైతులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అండగా నిలిచారు. 2008-09లో కొలు రైతులకు న్యాయం చేయాలనే సంకల్పంతో గుర్తింపునకు అదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో 35 వెలు, మండలంలో 1800 మంది కొలు రైతులు ఉన్నట్లు తేలగా గర్తింపు కార్డులు పంపిణీ చేశారు. అంతేకాక కౌలుదారు చట్టాన్ని తీసుకొన్ని ఆర్ఓఆర్ (రైట్ ఆఫ్ రికార్డ్స్) ప్రకారం పంట రుణాలు సైతం అందజేశారు.వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు సైతం పంపిణీ చేశారు.
సబ్సిడీలకు మంగళం
తెలంగాణ ఏర్పడ్డాక ‘ధరణి’ వెబ్ సైట్ తెరపైకి వచ్చింది. దీంతో కౌలుదారులకు సాయం అందించే ఆవకాశం లేకుండా పోయింది.అంతకుముందు విఆర్వోలు, విఆర్ఏలు పలానా రైతు పొలం సదరు వ్యక్తికి కొలుకు ఇచ్చారని నకలు రాసిస్తే యంత్ర పరికరాలు, పిత్తనాలకు సబ్సిడి లభించేది. 2008-09లో యంత్ర పరికరాలపై 50 శాతం సప్పిడి ఇచ్చేవారు. 2016-17 వరకు కౌలు రైతులకు కొనసాగిన నబ్బిడిలు ఆ తర్వాత అందలేదు. 2020 తర్వాత సాధారణ రైతులకు సైతం విత్తన సబ్నిడిలు పూర్తిస్థాయిలో ఎత్తేశారు పచ్చిరొట్టు విత్త నాలకు మినహా మిగిలిన వాటికి సబ్బిడీ ఇవ్వడం లేదు. వరి కిలో విత్తనాలకు 2020 ముందు వరకు రూ.5 నుంచి రూ.10 వరకు అవరాలకు 40 నుంచి 50 శాతం సబ్సిడీ రాయితీ దర్తించేది.
ఎన్నికల హామీల్లో స్థానం
 జిల్లాలో 35 వేలు,మండలంలో 1800 మంది వరకు కౌలు రైతులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ ద్వారా తెలుస్తోంది. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఆందడం లేదు ఏళ్లుగా భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేయడమే తప్ప ఎలాంటి హక్కులు, దక్కడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, సుభవించినప్పుడు సైతం పరిహారం అందకపోగా రైతుబంధు వంటి ప్రయోజనం లేదు. గత ఏడాది చివరిలో జరిగిన ఎన్నికల్లో కౌలు రైతులను కూడ ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించడం, పార్టీ అధికారంలోకి రావడంతో ఇకనైనా తమకు ప్రయోజనం దక్కుతుందని కౌలుదారులు ఆశిస్తున్నారు.
కౌలు రైతులను ఆదుకోవాలి..
అక్కల బాపు యాదవ్ రైతు సంఘం నాయకుడు
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కౌలు దారులకు పెట్టుబడి సాయం అందించాలి.వ్యవసాయేతర భూములకు కాకుండా చిన్న సన్న రైతులను ఆదుకునేలా అమలుచేయాలి.కౌలు రైతులకు కార్డులు అందజేయాలి.