– గుగ్గీల్ల ప్రజాపాలనలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
– చివరి వరకు సంక్షేమ పథకాలందించడమే ప్రభుత్వ ద్యేయమని స్పష్టీకరణ
– ఇథనాల్ పరిశ్రమను రద్ధు చేసేల ఎమ్మెల్యే చోరవ చూపాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-బెజ్జంకి సంక్షేమ పథకాల కోసం గతంలో నిరుపేదలు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారని.. పదేండ్ల ప్రభుత్వంలో కనీసం రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ, విద్యనభ్యసించడానికి పీజు రీయంబర్స్ మెంట్ వంటివి ప్రజలకేమి రాలేదని మానకోండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ సీతా లక్ష్మి అధ్వర్యంలో ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటుచేయగా ప్రత్యేక అధికారి రాఘవ రెడ్డి, ఎంపీడీఓ దమ్మని రాము ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హజరవ్వగా గ్రామ కాంగ్రెస్ నాయకులు డప్పుచప్పుల్లతో, టపాసులు కాల్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడారు. నియంత పాలనకు స్వస్తి చెప్పి ప్రజా పాలన సాగించే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలు నిర్భంధమైన జీవనం సాగించారన్నారు.చివరి నిరుపేదల వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందించడానికి శాయశక్తుల కృషి చేస్తానని స్పష్టం చేశారు.సంక్షేమ పథకాల్లో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ప్రజలు మద్యవర్తులను నమ్మవద్దని తెలిపారు. గ్రామస్తుల నుండి ప్రజాపాలన దరఖాస్తులను సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే స్వీకరించారు. అనంతరం మాజీ మండలాధ్యక్షుడు చెప్యాల శ్రీనివాస్, గ్రామాధ్యక్షుడు తిప్పరవేణి బాబు, నాయకుడు బోయిని ప్రశాంత్ పలువురు నాయకులు ఎమ్మెల్యే సత్యనారాయణను గజమాలతో సత్కరించి పార్టీ తలపాగ పెట్టి శాలువ కప్పి ఘనంగ సన్మనించారు. ఎంపీటీసీ కొమిరే మల్లేశం, ఉప సర్పంచ్ తిరుపతి, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు హజరయ్యారు.
ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని…
గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని ఎంపీటీసీ కొమిరే మల్లేశం, గ్రామస్తులు ఎమ్మెల్యే కవ్వంపల్లిని విజ్ఞప్తి చేశారు. ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి అనుమతులు గత ప్రభుత్వం మంజూరీ చేశారని పరిశ్రమ నిర్మాణం వల్ల గ్రామస్తులకు కలిగే ప్రయోజనాలు, దుష్ప ప్రయోజనాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన అనంతరం తగు చర్యలు తీసుకుందామని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని గ్రామస్తులు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు.