ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల సరఫరాకు చట్టబద్ధంగా టెండర్ వేయాలి

–  సరఫరాకు సంబంధించిన లావాదేవీలు పారదర్శకంగా ఉండాలి
 – పారదర్శకత అనేది ప్రజలందరూ చూసే విధంగా నోటీస్ బోర్డ్ లో ఉంచాలి
 – మాల మహానాడు జాతీయ నాయకులు గోలి  సైదులు
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్  
నల్లగొండ జిల్లా కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి లో   సరఫరా చేసే మందులకు చట్టబద్ధంగా టెండర్ వేయాలని  మాల మహానాడు జాతీయ నాయకులు గోలి సైదులు డిమాండ్ చేశారు. శనివారం ఆయన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందుల   సరఫరాకు సంబంధించిన లావాదేవీలు పారదర్శకంగా ఉండాలని, పారదర్శకత అనేది ప్రజలందరూ చూసే విధంగా నోటీస్ బోర్డ్ లో ఉంచాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా మందులను  సరఫరా చేసిన వ్యక్తి అన్ని రకాల బిల్లులు, ఓచర్లు, రసీదులు, ఆడిట్ రిపోర్టులు కూడా  సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వ్యక్తులకు ఇవ్వకుండా దాటవేస్తూ సూపర్డెంట్ పైన కూడా ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. టెండర్లు ఐదు నెలల్లో ముగుస్తున్నదని,  మధ్యలో ఎలక్షన్లు ఆ కాలం లోనే  టెండర్ కాలం  ముగిసే అవకాశం ఉన్నందున వేసే టెండర్ లోను  తనకు మాత్రమే అవకాశం ఇవ్వాలనే  ఉద్దేశంతోనే సూపర్డెంట్ కు డబ్బులు ఇచ్చాడని పేర్కొన్నారు. మందుల సరఫరాకు సంబంధించి రాపోలు వెంకన్న సరఫరా చేసిన మొదటి నుండి ఈ సంవత్సరం వరకు  జరిగిన లావాదేవీల పై  మొత్తం చట్టబద్ధంగా ఎంక్వయిరీ చేసి ఆ ఇంక్వైరీలో తేలిన నిజ నిజాలను, నిర్ధారణను బట్టి బాధ్యులైన వారిపై సిఆర్పిసి, ఐపిసి సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు  కలెక్టర్ ను కలిసిన వారిలో గోలి సైదులు, కొత్తపల్లి అశోక్ తదితరులు ఉన్నారు.