– రాజస్థాన్‌లో ఏడు గ్యారంటీలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో
– ఉచిత ల్యాప్‌టాప్, ద్వేషపూరిత ప్రసంగంపై
– చట్టం, జనతా క్లినిక్‌లు మరెన్నో..
జైపూర్: రాజస్థాన్‌లోని ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ తాయిలాలు ప్రకటించింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేస్తూ ఏడు హామీలతో పాటు ప్రాధాన్యతలను ప్రస్తావించింది. ఈ ప్రధాన ప్రాధాన్యతలలో కొన్నింటిని మనం పరిశీలిస్తే, ‘రైతుల సంక్షేమం’ మొదటి స్థానంలో ఉంచింది. స్వామినాథన్ కమిటీ సిఫారసుల ఆధారంగా కనీస మద్దతు (ఎంఎస్‌పీ) హామీని నెలకొల్పేందుకు నిర్దిష్ట చట్టాన్ని రూపొందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.
రైతులందరికీ సహకార బ్యాంకుల నుంచి రూ.లక్ష వరకు వడ్డీలేని వ్యవసాయ రుణ సౌకర్యం కల్పిస్తామని నేతలు ప్రకటించారు.. వ్యవసాయ బడ్జెట్‌లో మా ప్రభుత్వం ప్రారంభించిన 12 మిషన్లను విస్తరించి రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ఈఆర్‌సీపీ) క్రమబద్ధమైన అమలు కోసం ఒక వివరణాత్మక ప్రణాళిక సమర్పించనున్నది.
యువతకు ఉపాధి
రెండవ ప్రాధాన్యతగా యువత , ఉపాధి అంశాలను పెట్టింది. ఐదేండ్లలో 1పది లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, అందులో నాలుగు లక్షల మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించుకోనున్నారు.
పంచాయతీ స్థాయిలో నియామకాల కోసం కొత్త పథకాన్ని తీసుకువస్తామని, ఇందులో ఈ ఉద్యోగులు క్రమంగా ప్రభుత్వ ఖాళీలతో విలీనం చేస్తామనీ, అట్టడుగు స్థాయి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కాంగ్రెస్ తెలిపింది. నిరుద్యోగ యువత ఉపాధి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి, ‘టోల్ ఫ్రీ కాల్ సెంటర్’ సదుపాయం అలాగే ‘ఈ-ఎంప్లారుమెంట్ ఎక్స్ఛేంజ్’ ప్రారంభిస్తామన్నది.
మహిళా శక్తి గురించి…
మూడో ప్రాధాన్యతలో ‘మహిళా శక్తి’ ప్రస్తావన ఉంది. మహిళల భద్రతను పెంచేందుకు బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నది మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి గ్రామం, పట్టణ వార్డులో సెక్యూరిటీ గార్డులను నియమిస్తామన్నది. దీంతో లైంగిక వేధింపుల కేసుల్లో సత్వర న్యాయం కోసం సగటు విచారణ సమయాన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
రోడ్‌వేస్ బస్సుల్లో మహిళలకు ఉచిత కూపన్లు
ప్రస్తుతం ఉన్న రాయితీకి అదనంగా ప్రభుత్వం నడుపుతున్న రోడ్‌వేస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా మహిళలకు ఉచిత కూపన్ లభిస్తుంది. ముఖ్యమంత్రి ఉచిత చిరంజీవి ఆరోగ్య బీమా పథకం కింద ఉన్న కుటుంబ పెద్దలకు ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
కులగణనకు ప్రాధాన్యత..
కుల గణనకు నాల్గవ ప్రాధాన్యత. వాస్తవ జనాభా ప్రాతిపదికన ప్రయోజనాలను గుర్తించేందుకు కులాల వారీగా జనాభా గణన నిర్వహిస్తామని అధికార పార్టీ తెలిపింది.
చిరంజీవి ఆరోగ్యబీమా
మ్యానిఫెస్టోలో వైద్యం, ఆరోగ్యం ఐదవ ప్రాధాన్యత. ఏటా రూ.25 లక్షల ఉచిత చిరంజీవి ఆరోగ్య బీమా మొత్తాన్ని ఏటా రూ.50 లక్షలకు ముఖ్యమంత్రి పెంచుతారని పేర్కొన్నది. దీనితో పాటు, జిల్లా , బ్లాక్ స్థాయిలో ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఉచిత ఓపీడీ,ఐపీడీ కింద సౌకర్యాలు పెంచుతారు. సంతానం లేని దంపతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో ‘చిరంజీవి ఆరోగ్య బీమా పథకం’లో ఐవీఎఫ్ ప్యాకేజీని చేర్చి ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తామని ప్రజా మ్యానిఫెస్టోలో ప్రస్తావించింది.
ఆరో ప్రాధాన్యతగా విద్యారంగం..
విద్యా రంగాన్ని ఆరో ప్రాధాన్యతలో చేర్చారు. రాష్ట్రంలో విద్యా హామీ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఆర్టీఈ కింద 8 విద్యాభ్యాస సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఏడో గ్యారంటీగా కార్మికులు, చిన్న వ్యాపారులు
కార్మిక, చిన్న వ్యాపారం ఏడవ ప్రాధాన్యత. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం ద్వారా ప్రస్తుతం ఉన్న 1 వంద రోజులకు బదులు ఏడాదికి 15నూటయాభై రోజుల ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ మాదిరిగానే, మర్చంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అమలు చేయనున్నది, ఇది ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తూ చిన్న వ్యాపారులు, దుకాణదారులు, యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది.