నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలోనిలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసు కుంది. ఆలయ దుకాణ సముదాయాల అద్దెల విషయం లో ఎండోమెంట్ అధికారులు, పాత దేవాలయ కమిటీ మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి 23 షటర్లు ఉన్నాయి. వాటిలో నలుగురు యజమానులు తప్ప ఎవరూ అద్దె చెల్లించడం లేదని వారంరోజుల కిందట షట్టర్ల యజమానులకు నో టీసులు అందజేశారు. దుకాణాల సముదాయాల అద్దె చె ల్లించకపోవడంతో దేవాదాయశాఖ అధికారులు దుకా ణాలకు తాళాలు వేశారు. ఈ సందర్భంగా షట్టర్ల యజ మానులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులు భారీ పోలీస్ బందోవస్తుతో దుకాణాలను సీ జ్ చేశారు. దీనితో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దే వాలయ పాత ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికా రుల మధ్య వాగ్వాదం జరిగింది. దేవాదాయ శాఖకు మద్ద తుగా కాంగ్రెస్ నాయకులు, లయ కమిటీకి బీఆర్‌ఎస్ నా యకులు మద్దతుగా నిలబడినది రాజకీయ పులుముకుం ది. అనంతరం షట్టర్ల యజమానులు అధ్యక్షులు చెల్లించ డంతో షట్టర్ల తాళాలు తీశారు.