
మండలంలోని మహంతం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి హరిచరణ్ తక్కువ జీపీఏ వచ్చిందని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు బుధవారం తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు హరిచరణ్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదవగా మంగళవారం విడుదలైన ఫలితాలలో తక్కువ 8.3 జిపిఏ వచ్చిందనే మనస్థాపంతో పొలంలోకి వెళ్లి కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా గమనించిన స్థానికులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.