టెన్త్‌ పరీక్షల ఫీజు తత్కాల్‌ గడువు 2

– ఆలస్య రుసుం రూ.వెయ్యితో చెల్లించే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదోతరగతి పరీక్షలు-2024 మార్చిలో హాజరయ్యే విద్యార్థులు తత్కాల్‌ ద్వారా ఫీజు చెల్లింపు గడువు వచ్చేనెల రెండో తేదీ వరకు ఉన్నది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం రూ.వెయ్యితో వచ్చేనెల రెండు వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. ఆయా తేదీల్లో సాధారణ సెలవులుంటే మరుసటి రోజు ఫీజు చెల్లించొచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ఫీజు చెల్లించని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. పదో తరగతి విద్యార్థులకు ఫీజు చెల్లింపునకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు వచ్చేనెల ఏడో తేదీన గడువు ముగుస్తుందని తెలిపారు. ఇతర సమాచారం కోసం షషష.bరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదిం చాలని సూచించారు. రాష్ట్రంలో మార్చి 18 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.