ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో టెన్త్ టాలెంట్ టెస్ట్…

– 10 వ తరగతి టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాలు విడుదల
– విద్యార్థుల సుజనాత్మకతను వెలికితీయడం అభినందనియమం
– మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ప్రసన్న
నవతెలంగాణ – డిచ్ పల్లి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు  ప్రత్యేకంగా చొరవ చూపి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ ప్రసన్న కితాబిచ్చారు. విద్యార్థులలో మనోధైర్యం కోల్పోకుండా ,బోర్డ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల భయాన్ని పోగొట్టే ఆలోచన చేయడం  ఎస్ఎఫ్ఐ యొక్క క్రమశిక్షణకు నిలువుటద్దమని పొగిడారు.అనాడు మేము చదువుతున్న కాలం నుండి ఎస్ఎఫ్ఐ పోరాటాలే కాకుండా ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులు చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి 10/10 గ్రేడ్ సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. చదువు అన్నింటికీ మార్గమని వివరించారు. ఈసందర్బంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ  ప్రతిభ పరీక్షలు అనేక స్కూల్స్ లో( విక్టరీ, వందేమాతరం, విద్యా, వివేకానంద పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏళ్ళాపుడు పోరాటాలే కాకుండా విద్యార్థులలో సృజనాత్మకతను వేలికితీస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు. మండల కేంద్రంలో దాదాపుగా 300 మంది విద్యార్థులు టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటున్నారని  అన్నారు. ఈ ప్రతిభ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  విద్యాసంస్థల యాజమాన్యం, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంధ్య రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ అద్యక్షులు ప్రసాద్, నాయకులు దినేశ్, చిత్రు, పవన్ తదితర నాయకులు పాల్గొన్నారు.