ఏడబ్ల్యు సొసైటీ డివిజన్ ఉపాధ్యక్షురాలగా తెప్పల రజిత 

Teppala Rajitha as Vice President of AW Society Divisionనవతెలంగాణ – మల్హర్ రావు
అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ ఆదేశాలు, కాళేశ్వరం జోనల్  ఐదు జిల్లాల యువజన అధ్యక్షుడు  చింతల కుమార్ యాదవ్, సూచన మేరకు ఎడబ్ల్యూ కాటారం డివిజన్  ఉపాధ్యక్షురాలుగా మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన తెప్పల రజితను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ ఏడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కొండ రాజమ్మ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు.తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్,కాళేశ్వరం జోనల్ నాయకులు కుమార్ యాదవ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ బాధ్యతపై అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీకి మంచి పేరు తీసుకవస్తామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ డివిజన్ అధ్యక్షురాలు కొండూరి మమత,కాటారం డివిజన్ యూత్ అధ్యక్షుడు వేల్పుల మహేందర్ పాల్గొన్నారు.