
నవతెలంగాణ- మల్హర్ రావు
గ్రామపంచాయితీల్లో సర్పంచ్ ల పదవీకాలం గురువారంతో ముగిసింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామపంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పాలన శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర ఏన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని డిసెంబర్ నెలలోనే ఆదేశించింది.కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సంసిద్ధత చూపకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన అనివార్యమైంది.దీంతో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ భవేస్ మిశ్రా ఆదేశాల మేరకు 241 పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మండలంలో 15 గ్రామపంచాయితీల్లో 8మంది ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టారు. ఆన్ సాన్ పల్లి, నాచారం గ్రామాలకు హరిత (ఆర్ డబ్ల్యూఎస్), చిన్నతూoడ్ల, మల్లారం గ్రామాలకు ఏ.సుధాకర్ (మండల వ్యవసాయ అధికారి) దుబ్బపేట, వళ్లెంకుంట గ్రామాలకు విక్రమ్ కుమార్ (ఎంపిఓ) ఎడ్లపల్లి, కొయ్యుర్ గ్రామాలకు అశోక్ కుమార్ (పిఆర్ఏఈ) కొండంపేట, ఇప్పులపల్లి గ్రామాలకు ఎస్.శ్రీనివాస్ (డిప్యూటి తహసీల్దార్), అడ్వాలపల్లి, పెద్దతూoడ్ల గ్రామాలకు నరసింహమూర్తి (మండల ఎంపిడిఓ), రుద్రారం, మల్లంపల్లి గ్రామాలకు శ్రీనివాస్ (మండల తహశీల్దార్),తాడిచెర్ల గ్రామానికి అవినాష్ మండల (స్పెషల్ అధికారి) అధికారులు బాధ్యతలు చేపట్టారు.