గిల్‌, రాహుల్‌కు పరీక్ష

– ఆస్ట్రేలియాతో తొలి వన్డే నేడు..
– మధ్యాహ్నం 1.30గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
ముంబయి: టెస్ట్‌ సిరీస్‌ను గెలిచిన టీమిండియా.. ఇక వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేలో ఓపెనర్లకు పరీక్ష ఎదురుకానుంది. కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌ లేమితో బాధపడుతుండగా.. యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. తొలి వన్డేకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో ఓపెనింగ్‌ భారం వీరిద్దరిపైనే ఆధారపడి ఉంది. ఇక వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా ఓపెనర్‌గా రాణించగల సమర్థుడే. ఈ క్రమంలో జట్టు మేనేజ్‌మెంట్‌ వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఓపెనింగ్‌ జోడీలను పరీక్షించనుంది. ఆసీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ ఘోరంగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్‌లో కలిసి కెఎల్‌ రాహుల్‌ 200 పరుగుల్లోపే.. వాంఖడే వేదికగా జరిగే తొలి వన్డేలో సారథ్య బాధ్యతలను హార్దిక్‌ పాండ్యాకు వరించింది. ఈ మైదానంలో చివరిసారిగా ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌, డేవిడ్‌ వార్నర్‌ సెంచరీలతో రాణించడంతో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
జట్లు..
ఇండియా: హార్దిక్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, సూర్యకుమార్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), జడేజా, కుల్దీప్‌, సుందర్‌, చాహల్‌, షమీ, సిరాజ్‌, ఉమ్రన్‌ మాలిక్‌, శార్దూల్‌, అక్షర్‌, ఉనాద్కట్‌.
ఆస్ట్రేలియా: స్మిత్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, హెడ్‌, లబూషేన్‌, మిఛెల్‌ మార్ష్‌, స్టోయినీస్‌, కాన్వే, మ్యాక్స్‌వెల్‌, గ్రీన్‌, ఇంగ్లిస్‌, అబాట్‌, అగర్‌, స్టార్క్‌, ఎల్లిస్‌, ఆడం జంపా.