నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టరు రెగ్యులర్ మరియు రెండవ, మూడవ నాల్గవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రారంభం.రెండవ రోజు పరీక్షకు ఉదయం 36 మంది విద్యార్థులకు గాను 36 మంది విద్యార్థులు హాజరయ్యారు.మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 01 ఒక విద్యార్థిగాను 01 ఒక విద్యార్థి హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలియజేశారు.
పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతం..
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఎం ఏ/ ఎం.కాం/ ఎం ఎస్ డబ్ల్యూ/ ఎమ్మెల్సీ./ ఎల్.ఎల్.బి/ ఎల్ ఎల్ ఎం/ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోడ్స్ ( ఏపీ ఈ./ ఐపిసిహెచ్./ ఐ ఎం బి ఏ./ఒకటవ,మూడవ,నాలుగవ, ఏడవ, మరియు తొమ్మిదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు 07 వ ఈరోజు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణ వర్సిటీ మెయిన్ క్యాంపస్,తెలంగాణ వర్సిటీ సౌత్ క్యాంపస్ బిక్నూర్, గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్,ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి, ఎస్ ఆర్ ఎన్ కె గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూర్ లో జరిగిన పరీక్షకు ఉదయం 212 మంది విద్యార్థులకు 190 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన తెలంగాణ వర్సిటీ మెయిన్ క్యాంపస్ లో జరిగిన పరీక్షలకు 14 మంది విద్యార్థుల కాను 13 మంది విద్యార్థులు హాజరయ్యారు 01 ఒక విద్యార్థి గైరాసరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలియజేశారు.