
పోషక ఆహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆర్ బి ఎస్ కే టీం వైద్యులు మనోజ్, సాధన తెలిపారు. మంగళవారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఉన్న బస్తీ దావకాన పరిధిలోని కంచర్ల, అయ్యవారిపల్లి గ్రామాలలో ఉన్న ఐదు సంవత్సరాల లోపు పిల్లలు, అంగన్వాడి కేంద్రాల్లోని చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒక చిన్నారికి పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉన్న కారణంగా నిజామాబాద్ ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, ఫార్మసిస్ట్ యాదవ్ గౌడ్, ఎం ఎల్ హెచ్ పి పూజ, పీహెచ్ఎన్ రాణి, ఏఎన్ఎం శ్యామల, సూపర్వైజర్ సువర్ణ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.