మస్కులర్  డిస్ట్రోఫీతో బాధపడుతున్న వారికి పరీక్షలు..

Tests for Muscular Dystrophy– జిల్లా వయోవృద్ధుల, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ  అధికారి కృష్ణవేణి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాలో మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వయవృద్ధుల మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి తెలిపారు. సోమవారం  జిల్లా సంక్షేమ అధికారి మహిళా అభివృద్ధి శిు వికలాంగుల , వయోవృద్దుల సంక్షేమ శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో మస్క్యులర్ డిస్ట్రోఫీ తో (తీవ్రమైన వైకల్యంతో ) బాధపడుతున్న బాధితులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ రెండు ప్రకారంగా అధిక మద్దతు (హై సపోర్ట్ నీడ్) కల్పించాలంటూ( కేర్ టేకర్ టేకర్ అలవెన్స్ న్యూట్రిషన్ ఫుడ్ మెడిసిన్స్) జిల్లాలో ఉన్న కండరాల క్షిణిత బాధితులు అర్జీ పెట్టుకోగా అందులో భాగంగా వచ్చిన దరఖాస్తులను నేడు జిల్లా హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద  డాక్టర్ల బృందం తో కలిసి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో  డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద ,  సూపర్డెంట్ శశికళ , డిఇఓ మంజుల , వైద్య బృందం సంఘాల బాధితులు పాల్గొన్నారు.