నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు బుధవారం ఉదయం పది గంటలకు విడుదల కానున్నాయి. ఈనెల 15న టెట్ రాతపరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్ పేపర్-1కు 2,69,557 మంది దరఖాస్తు చేస్తే వారిలో 2,26,744 (84.12 శాతం) మంది హాజరయ్యారు. పేపర్-2కు 2,08,498 మంది దరఖాస్తు చేయగా, వారిలో 1,89,963 (91.11 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.