నేడు టెట్‌ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాతపరీక్షలకు సంబంధించిన ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో గతనెల 20 నుంచి ఈనెల రెండో తేదీ వరకు రాతపరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్‌ పేపర్‌-1కు 99,958 మంది దరఖాస్తు చేయగా, 85,996 (86.03 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. 13,962 మంది గైర్హాజరయ్యారు. పేపర్‌-2కు 2,86,381 మంది దరఖాస్తు చేస్తే, 2,36,487 (82.58 శాతం) మంది పరీక్ష రాశారు. 49,894 మంది గైర్హాజరయ్యారు.