ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి 

నవతెలంగాణ – బెజ్జంకి 
ఉద్యోగ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయించాలని ఏస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రం వద్ద ఉద్యోగ ఉపాధ్యాయులు మాట్లాడారు. గత కొన్నేండ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని..ఇప్పటివరకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించలేదని ఇప్పటికైనా పదోన్నతుల ప్రక్రియ చేపట్టి 2010కి ముందు ఎంపికైన ఉద్యోగ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.ఉపాద్యాయులు నారోజు శంకరా చారి, రామంచ రవీందర్,రమేశ్,సతీశ్ కుమార్, రఘునాథ్ హజరయ్యారు.