20 నుంచి ఆన్‌లైన్‌లో టెట్‌ రాతపరీక్షలు

– జూన్‌ 2 వరకు నిర్వహణ
– 2,86,386 మంది అభ్యర్థుల దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాతపరీక్షలు ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌, టెట్‌ కన్వీనర్‌ ఎం రాధారెడ్డి శుక్రవారం రాతపరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ రెండో తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 20, 21,22,24, 28, 29 తేదీల్లో పేపర్‌-2, ఈనెల 30, 31, వచ్చేనెల ఒకటి, రెండో తేదీన పేపర్‌-1 రాతపరీక్షలు జరుగుతాయని వివరించారు. వచ్చేనెల ఒకటో తేదీన పేపర్‌-2 మ్యాథ్స్‌, సైన్స్‌ అభ్యర్థులకు మైనర్‌ మీడియంలో రాతపరీక్ష ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌కు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్‌-1కు 99,958 మంది, పేపర్‌-2కు 1,86,428 మంది ఉన్నారు. ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌, వచ్చేనెల నాలుగో తేదీన సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈనెల 27న, వచ్చేనెల మూడో తేదీన రాతపరీక్షల తేదీలను సవరించారు.
టెట్‌ రాతపరీక్షల షెడ్యూల్‌
పేపర్‌        సబ్జెక్టు      మీడియం      తేదీ
1. పేపర్‌-2 మ్యాథ్స్‌, సైన్స్‌ ఈఎం/టీఎం మే 20న
2. పేపర్‌-2 మ్యాథ్స్‌,సైన్స్‌ ఈఎం/టీఎం ||
3. పేపర్‌-2 మ్యాథ్స్‌, సైన్స్‌ ఈఎం/టీఎం మే 21న
4. పేపర్‌-2 మ్యాథ్స్‌, సైన్స్‌ ఈఎం/టీఎం ||
5. పేపర్‌-2 మ్యాథ్స్‌, సైన్స్‌ , ఈఎం/టీఎం మే 22న
6. పేపర్‌-2 మ్యాథ్స్‌, సైన్స్‌ ఈఎం/టీఎం ||
7. పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌ మైనర్‌ మే 24న
8. పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌ ఈఎం/టీఎం ||
9. పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌ ఈఎం/టీఎం మే 28న
10. పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌ ఈఎం/టీఎం ||
11. పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌ ఈఎం/టీఎం మే29న
12. పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌ ఈఎం/టీఎం ||
13. పేపర్‌-1 — ఈఎం/టీఎం మే30న
14. పేపర్‌-1 — ఈఎం/టీఎం ||
15. పేపర్‌-1 — ఈఎం/టీఎం మే31న
16. పేపర్‌-1 — ఈఎం/టీఎం ||
17. పేపర్‌-2 మ్యాథ్స్‌, సైన్స్‌ మైనర్‌ జూన్‌ 1న
18. పేపర్‌-1 — మైనర్‌ ||
19. పేపర్‌-1 — ఈఎం/టీఎం జూన్‌ 2న
20. పేపర్‌-1 — ఈఎం/టీఎం ||