నవతెలంగాణ – తంగళ్ళపల్లి
పాఠశాలలు పునః ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థుల చెంతకు పాఠ్యపుస్తకాలు చేరాయని ఎంపీపీ పడిగల మానస అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల చే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థులకు పుస్తకాలను, దుస్తులను పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. గతంలో పాఠ్యపుస్తకాలు, దుస్తులు కాస్త ఆలస్యంగా వచ్చేవని విద్యార్థులకు పూర్తిస్థాయిలో కూడా పాఠ్యపుస్తకాలు అందేవి కావని అరకొరగా పాఠ్యపుస్తకాలు అందేవని పలువురు తెలిపారు.