హైదరాబాద్ : నగరంలోని తాజ్ డక్కన్‌లో మూడు రోజుల పాటు బ్రాండెడ్ దుస్తులు, వివిధ ఉపకరణాల ఎగ్జిబిషన్, అమ్మకాలను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మార్చి 30,31, ఏప్రిల్ ఒక్కటో తేది వరకు ఈ ప్రదర్శన ఉంటుందని శ్రీ ఖటు శ్యామ్ బాబా బ్రాండ్ స్టోర్ యాజమాని బిమల్ గొయాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో 80 శాతం వరకు తగ్గింపు ధరలతో ఉత్పత్తులు లభ్యమవుతాయన్నారు. ఫ్యాక్టరీ నుండి నేరుగా విక్రయించడంతో చౌక ధరలకు పొందవచ్చన్నారు. పిల్లలు, పెద్దలకు సంబంధించిన అన్ని రకాల దుస్తులు సహా బూట్లు, ఫ్యాషన్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు.