టీఎఫ్‌జెఎ గొప్ప పని చేస్తోంది : విజయ్ దేవరకొండ

టీఎఫ్‌జెఎ గొప్ప పని చేస్తోంది : విజయ్ దేవరకొండతెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యుల సంక్షేమం నిరంతరం కషి చేస్తోన్న సంఘం. ఈ ఏడాదితో అసోషియేషన్‌ రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. అసోషియేషన్‌ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో, కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు ఆరోగ్య భీమా సౌకర్యం ఉంటుంది. అలాగే టర్మ్‌ పాలసీ విషయానికి వస్తే సభ్యుడికి రూ.15 లక్షలు, యాక్సిడెంటల్‌ పాలసీ సభ్యుడికి రూ.25 లక్షలను అందేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. ఈ యేడాది (2024-25) వరకూ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్‌ కార్డ్స్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో విజరు దేవరకొండ, ఆర్‌.నారాయణమూర్తి, దిల్‌ రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, టీఎఫ్‌జెఎ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్‌ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్‌ సురేంద్ర నాయుడు సహా అసోసియేషన్‌ సభ్యులు, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.
హీరో విజరు దేవరకొండ మాట్లాడుతూ,’జర్నలిస్టులకు శ్రీనివాసరెడ్డి ల్యాండ్‌లు ఇప్పిస్తే, అందరూ ఆనందంగా ఉంటారు. జర్నలిస్టుల హెల్త్‌ కార్డుల సెలబ్రేషన్‌లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జీవితంలో ఎవరికైనా మూడే ముఖ్యం. ఒకటి ఆరోగ్యం, రెండు ఆనందం, మూడు డబ్బు. ఈ మూడిటిలో ఏది ఉన్నా, ఇంకోటి ఉంటుంది. ఉండి తీరుతుంది. జీవితంలో ఈ మూడు ఉంటాయి. నా కెరీర్‌ మొదటి నుంచీ జర్నలిస్టులు నాతోనే ఉన్నారు. నేను మీతో సుదీర్ఘ ప్రయాణం చేస్తాను అని అన్నారు. ‘హెల్త్‌ కోసం తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం చూస్తుంటే ఆనందంగా ఉంది. మీలో ఎక్కువమంది 40 ఏళ్లు దాటినవారే. జర్నలిస్టుగా రాసే పదం చాలా ముఖ్యం. సెల్‌ఫోన్లను నొక్కుతున్నారు కాబట్టి, కాస్త జాగ్రత్తగా చూసి నొక్కితే పాజిటివ్‌ వైబ్‌ ఉంటుంది’ అని నిర్మాత దిల్‌రాజు చెప్పారు.
ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ,’జర్నలిస్టులకు ఇళ్లను ఫ్రీగా ఇప్పించండి. స్థలాలను రేవంత్‌రెడ్డిని అడగండి. తుపాకి కన్నా కలానికి భయపడతానని అన్నారు నెపోలియన్‌. ఎంతో మంది జర్నలిస్టులను కన్నది సినిమా తల్లి. సినిమా గురించి రాస్తున్నప్పుడు దయచేసి సినిమాను చంపేయకండి. సినిమా ఇవాళ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సినిమా ఇండిస్టీలో 90 శాతం సగటు నిర్మాతలున్నారు. కానీ 10 శాతమే విజయం ఉంది. మిగలిన 90 శాతం ఎలా ఉంది? మీడియా సైతం పెద్ద సినిమాలనే ప్రొజెక్ట్‌ చేస్తున్నారు. చిన్న సినిమాల గురించి ఆలోచించండి ‘ అని తెలిపారు.