నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీఈఏపీసెట్) (బైపీసీ) 2024 చివరి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎ. దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4న స్లాట్ బుక్ చేయడంతో పాటు ఫీజు చెల్లించాలనీ, ఐదున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 5, 6 తేదీల్లో ఆప్షన్ నమోదు చేసుకోవాలని సూచించారు. 9న సీట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు సాంకేతిక విద్యాశాఖ వెబ్‌సైట్ (టీజీఈఏపీసీఈటీబీ.ఎన్‌ఐసీ) సందర్శించాలని కోరారు.