నవతెలంగాణ బ్యూరో – హైదరాబాబాద్
ఇంటర్ వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం విధుల్లో పాల్గొన్న వారికి రెమ్యూనరేషన్‌ను వెంటనే చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల సంఘం (టీజీజేఎల్‌ఏ-475) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం నుంచి మూల్యాంకనం కేంద్రాల వద్ద దశలవారీగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి జోక్యం చేసుకుని పెండింగ్‌లో ఉన్న రెమ్యూనరేషన్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.