ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా టీజీఎండీసీ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ అనిల్ ఈరవత్రి ఆయన చిత్రపటానికి పూలతో ఘనమైన నివాళి అర్పించారు.ఈ సందర్బంగా అనిల్ ఈరవత్రి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో సిద్ధాంతకర్త జయశంకర్ అలుపెరగని పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేశాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన్ను ఎల్లవేళలా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీజీఎండీసీ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.