నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆర్టీఏ అధికారి, జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రమేష్‌పై ఆటో యూనియన్ పేరుతో వ్యక్తి దాడి చేయడం అమానుషమనీ, ఈ దాడిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ఖండించింది. దాడి విషయం తెలుసుకున్న టీజీవో రాష్ట్ర ప్రధనా కార్యదర్శి ఎ సత్యనారాయణ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్, టీజీవో అసోసియేట్ ప్రెసిడెంట్ బి శ్యామ్, నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, కృష్ణాయాదవ్, ఆర్టీవో అధికారుల సంఘం అధ్యక్షులు రవీందర్‌కుమార్, నాయకులు ఏంజులరెడ్డి తదితరులు రమేష్‌ని శుక్రవారం కలిసి సంఘీభావం ప్రకటించారు. అధికారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. అధికారులు, ఉద్యోగుల మనోస్థైర్యం దెబ్బతినకుండా చూడాలని సూచించారు. దాడి చేసే వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించొద్దని తెలిపారు.