
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ హిందీ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి గాను నిర్వహించిన పరీక్షల్లో మద్నూర్ మండల కేంద్రానికి చెందిన విశ్వజిత్ కాంబ్లే అనే యువకుడు స్టేట్ నాలుగో ర్యాంకు సాధించారు. హిందీ జూనియర్ లెక్చరర్ పోస్టుకు 450 మార్కులకు గాను ఈ యువకుడు 340.859 మార్కులు సాధించారు. స్టేట్ పరంగా నాలుగో ర్యాంకు వచ్చింది. మద్నూర్ మండల కేంద్రానికి చెందిన యువకుడు ఈ ర్యాంకు సాధించినందుకు ఆయన తల్లిదండ్రుల్లో బంధుమిత్రులు సంతోషం వ్యక్తం కాగా .. ఆ యువకునికి గ్రామస్తులు నాలుగో ర్యాంక్ సాధించినందుకు అభినందించారు.