– నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సెక్రెటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఎస్‌ఓఏ) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల అధికారి ఎన్. శంకర్ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈనెల 4న జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్నికల షెడ్యూల్ ప్రక టించామని తెలిపారు. 13న నామినేషన్ల దాఖలు, 14 సాయంత్రం 5 గంట ల వరకు విత్‌డ్రాకు అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. 18న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామనీ, అనంతరం ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. కాగా ఈ ఎన్నికల్లో 180 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.