విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి: టీజీయూ ఈఈయూ

Issues of electricity workers should be resolved: TGU EEUనవతెలంగాణ – భగత్ నగర్ 
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఈ నెల  22 తేదిన ఇందిరా పార్క్  వద్ద నిర్వహించనున్న అన్ మ్యాన్నేడ్  కార్మికుల రిలే నిరహార దిక్ష ను   విజయవంతం చెయ్యాలని టీ జీ యూ ఈ ఈ యూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ  సందర్భంగా కరీంనగర్ సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీర్  గంగాధర్    మెమోరాండామ్ అందజేశారు. రెగులర్ ఉద్యోగులతో  పాటుగా  సమాన సేవలందిస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ప్రమోషన్స్ ఇవ్వాలని అదే విధంగా కన్వర్షన్ కూడా ఇవ్వాలని వారు కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షులు నలవాల స్వామి జిల్లా కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్, రూరల్ డివిజన్ అధ్యక్షులు శివరామకృష్ణ రూరల్ డివిజన్ కార్యదర్శి నవజీలాల్ టౌన్ డివిజన్ కార్యదర్శి సురభి శ్రీకాంత్  పాల్గొన్నారు.