నవతెలంగాణ – కామారెడ్డి: తలసేమియా సికెల్ సెల్ రాష్ట్రస్థాయి పురస్కారానికి కామారెడ్డికి చెందిన డాక్టర్ బాలు ఎంపిక అయ్యారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 3500 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం, తల సేమియా వ్యాధి గురించిన అవగాహనను కల్పించినందుకు గాను తల సేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాదు వారు సెప్టెంబర్ 1న తల సేమియా సికిల్ సెల్ రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందుకోనున్నట్టు ఐవిఎఫ్ సేవాద రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
మీ సహకారానికి ధన్యవాదములు
ఈ అవార్డు రావడానికి సహకరించిన రక్తదాతలకు, కళాశాలల యాజమాన్యాలకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను తలసేమియా చిన్నారుల కోసం నిర్వహిస్తానని వారి ప్రాణాలను కాపాడడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని అన్నారు.