భారతీయ జనతా పార్టీ మండల శాఖ నూతన అధ్యక్షుడిగా మండలంలోని మేడారం గ్రామానికి చెందిన తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్ ను నూతన అధ్యక్షునిగా రాష్ట్ర బిజెపి పార్టి ఎన్నుకున్నారు. లక్ష్మణ్ గౌడ్ గతంలో బిజెపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎనలేని సేవలు చేసి పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. తన కృషికి గుర్తింపు గానే మండల అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లక్ష్మణ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో బిజెపి పార్టీని గ్రామస్థాయి నుండి, మండల జిల్లా రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసి రాష్ట్రంలో బిజెపి అధికారంలో వచ్చే వరకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం, ఉపాధ్యక్షులు కృష్ణకరరావు, మాజీ మండల అధ్యక్షులు మల్లెల రాంబాబు బిజెపి నాయకులు సురేందర్, హనుమంత్ రెడ్డి, శ్రీకాంత్, ఆలకుంట చిన్న, సుభాష్, శ్రీనివాస్, సుధాకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.