రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. కె.ఇ.జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల ఈ చిత్ర ఆడియో వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, ‘సాధారణంగా సినిమా హిట్ తర్వాత ఫ్లాప్ ఇస్తే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లో ఓ టెన్షన్ ఉంటుంది. నెక్ట్స్ ఎలాగైనా హిట్ మూవీ ఇవ్వాలని అనుకుంటారు. హిట్ తర్వాత హిట్ మూవీ ఇవ్వాలనే టెన్షన్ అందరికీ ఉంటుంది. సాధారణంగా హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్నీ అలా కుదరాలి. ‘జైలర్’ మూవీ హిట్ తర్వాత అంతటి హిట్ సినిమా ఇవ్వాలనే టెన్షన్‌తో ఉన్నాను’ అని అన్నారు.
”జై భీమ్’ మూవీ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం వస్తుందని తెలుసు. కానీ ఇలాంటి గొప్ప అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆయనకు సన్నివేశాలు రాసే సమయంలో ఆయన మాత్రమే చేయగలడు అనేలా మాస్ సన్నివేశాలు కుదిరాయి. కథ రాసుకునే సమయంలోనే అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా.. ఇలా అందరినీ ఉహించుకునే రాసుకున్నాను. రజినీకాంత్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఉండటం వల్లనే వారందరినీ ఈ సినిమాలో యాక్ట్ చేసేలా ఒప్పించగలిగాను. సుభాస్కరన్ కథ వినగానే మీకెలా కావాలో సినిమాను అలా చేయండి అన్నారు. ఆయన చెప్పినట్లుగానే తమిళ్ కుమరన్ నాకు సపోర్ట్ అందించారు. అభిమానులు ఊహించుకున్న దాని కంటేఎక్కువగానే ఈ సినిమా ఉంటుంది. ప్రతి చిన్న మూమెంట్‌ను ఎంజారు చేస్తారు’ అని డైరెక్టర్ కె.ఇ.జ్ఞానవేల్ చెప్పారు.
‘లైకాప్రొడక్షన్స్ జర్నీ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సుభాస్కరన్‌కి అభినందనలు. సూపర్‌స్టార్ రజనీతో మరోసారి కలిసి ట్రావెల్ చేయటం మరచిపోలేని అనుభూతి నిచ్చింది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని లైకా ప్రొడక్షన్స్ హెడ్ చెప్పారు.
రజనీకాంత్‌తో చాలా సంవత్సరాలుగా మంచి పరిచయం ఉంది. వత్తి పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ తను నాకెంతో సన్నిహితంగా ఉంటారు. రజనీకాంత్ పాత్ర గురించి, నా పాత్ర గురించి తెలిసిన తర్వాత నేను జ్ఞానవేల్ నెరేషన్ నచ్చి సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. రజనీతో యాక్ట్ చేయటానికి గొప్పగా, గర్వంగా భావిస్తున్నాను. తను మనందరికీ ఓ మంచి గిఫ్ట్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. చాలా సింపుల్‌గా కనిపిస్తారు. అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను.
– అమితాబ్ బచ్చన్