వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబోలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ, ‘కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ విజయం మరోసారి రుజువు చేసింది. ఇది మా విజయమే కాదు ఇంత గొప్పగా సపోర్ట్ చేసిన ప్రేక్షకులు, అభిమానులది కూడా. ప్రేక్షకులు ఈ విజయాన్ని కోరుకున్నారు. ఇది ప్రేక్షకుల విజయం. ప్రేక్షకులు కోరుకుంటే ఆ ఎనర్జీ వస్తుంది. అనిల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ ఎనర్జీ వచ్చింది. ఆడియన్స్ పాజిటివ్ వైబ్స్‌తో సినిమా చూశారు. ఫిల్మ్ ఇండిస్టీలోని అందరూ ఫోన్ చేసి మనస్పూర్తిగా సినిమాని అభినందిస్తున్నారు. సినిమాని ఫ్యామిలీ అందరితో కలిసి చూడటం చాలా ఆనందంగా ఉంది. మహేష్ బాబు తనకి సినిమా చాలా నచ్చి, ట్వీట్ చేశారు’ అని తెలిపారు.
‘మేము ఊహించిన దాని కంటే సినిమాని ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ప్రేక్షకులకు నా పాదాభివందనాలు. ఇప్పటి వరకూ నేను తీసిన ఎనిమిది సినిమాలు.. ఒక్కొక్క సినిమా ఒక్కో జర్నీ. ఇందులో లాస్ట్ ఐదు సినిమాలు కంటిన్యూగా వందకోట్ల గ్రాసర్స్. లాస్ట్ ఐదు సినిమాలు యూఎస్‌లో వన్ మిలియన్ గ్రాసర్స్. ఒక దర్శకుడిగా ఆడియన్స్‌కి ఎంత థాంక్ ఫుల్‌గా ఉండాలో అర్థం కావడం లేదు’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. నిర్మాత శిరీష్ మాట్లాడుతూ,’ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు ధ్యాంక్స్. ఈ సినిమా మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తుందనే అనిల్ షూటింగ్‌లో చెప్పేవారు. ఆయన మాట నిజమైంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా మేము ఊహించని మహా అద్భుతం. ఇది మాకు బ్లాక్ బస్టర్ పొంగల్. ఈ సంక్రాంతిని మర్చిపోలేం’ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.