– ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్
తెలంగాణ రాష్ట్రంలో తాండలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. గత ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్రం లో 5848 తాండల్లో సుమారు 1271తాండలను మాత్రమే గ్రామపంచాయతీలుగా చేసారని కానీ అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో ఏర్పాటు చేసిన తండా గ్రామపంచాయతీలకు పక్క భవనం నిర్మించకపోవడం వల్ల చెట్ల కింద పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వం లో సర్పంచులకు నిధులు ఇవ్వకపోవడం తో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో మిగిలిన తాండలను గ్రామపంచాయతీలుగా చేసి తాండలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు.