థ్యాంక్యూ సీఎం : ఎమ్మెల్సీ ఎల్‌ రమణ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
చేనేత కళాకారులకు నేరుగా వారి అకౌంట్లో రూ.2వేలు, అనుబంధ కార్మికులకు రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సహకారాన్ని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, మంత్రి కే తారకరామారావుకు ఎమ్మెల్సీ ఎల్‌ రమణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఈ తరహా ప్రత్యక్ష సహాయాన్ని అందించడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. దేశంలో ఎక్కడా చేనేత కార్మికుల కోసం రూ. ఐదు లక్షల బీమా సౌకర్యం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటి కార్యక్రమాలు లేవని చెప్పారు. ఒక్క తెలంగాణలో మాత్రమే ఈ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆశాఖకు సంబంధించిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలిపారు