– కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్
– ‘ఎక్స్’లో పోస్ట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కర్నాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను స్వయంగా అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒప్పుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. డీకేను ఉద్దేశించి సుదీర్ఘ లేఖను ఆయన పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే, అంధకారమేనని కర్నాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందని ఎద్దేవా చేస్తూ, రాష్ర ్టప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆ పోస్టులో ఏకరువు పెట్టారు. తెలంగాణ గడ్డ చైతన్యానికి అడ్డా అనీ, ఇక్కడ కాంగ్రెస్ రాజకీయాలు చెల్లవని పేర్కొన్నారు.