తుక్కుగూడ సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు

నవతెలంగాణ- మోపాల్

ఆదివారం రోజు కాంగ్రెస్ తలపెట్టిన తుక్కుగూడ సభకు రూరల్ నియోజకవర్గం నుండి కార్యకర్తలు మరియు వేలాది మంది ప్రజలు తరలివచ్చినందుకు ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు, ఆ సభ చూస్తే కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కచ్చితంగా వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని రైతుల ప్రభుత్వం, కర్షకుల ప్రభుత్వం వస్తుందని మేము ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యంగా మంచిప్ప ప్రాజెక్టు రీ డిజైన్ రద్దుచేసి అక్కడున్న ప్రజల కళ్ళలో వెలుగు నింపుతామని కాంగ్రెస్ కిసాన్ గేట్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగ రెడ్డి తెలిపారు. అలాగే వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.