బీజేపీ పెద్దలకు ధన్యవాదాలు

Thanks BJP eldersనవతెలంగాణ – ఆత్మకూరు
బీజేపీ ఆత్మకూరు మండలం శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉప్పుగల్ల శ్రీకాంత్ రెడ్డిని  ఏకగ్రీవంగా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ..  రెండవసారి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పజెప్పిన జిల్లా అధ్యక్షురాలు రావు పద్మక్క , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ ప్రబారి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి జయంత్ లాల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం గురు ప్రసాద్,బిజెపి మండల అధ్యక్షులు  బలవంతుల రాజు, మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం  మండలంలోని శక్తి కేంద్రం ఇన్చార్జిలకు బూత్ అధ్యక్షులకు వివిధ మోర్ఛా మండల అధ్యక్షులకు, కార్యకర్తలందరికీ  పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు . మండలంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తన వంతు గా కృషి చేస్తానని తెలిపారు.