ఏకగ్రీవ తీర్మానం పట్ల కృతజ్ఞతలు

– బీసీలను గుర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం:  తిరుపతి గౌడ్
నవతెలంగాణ-శంకరపట్నం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో బీసీ సమగ్ర కుల గణన చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కాచాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ గట్టు తిరుపతి గౌడ్ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీసీలను గుర్తించలేదని, మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసిఆర్ కు తగిన గుణపాఠం చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి హక్కున్న చేర్చుకొని నవంబర్ 2023 లో జరిగిన కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఆదరణ చూపి భారీ మెజార్టీ స్థానాల్లో శాసనసభ్యులను గెలిపించిన తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రెండు నెలల వ్యవధిలోనే రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వము సమగ్ర కుల గణన చేపట్టేందుకు ఏకగ్రీవ తీర్మానం చెయ్యడం అభినందనీయం అన్నారు. 57 సంవత్సరాలు గడుస్తున్న బీసీలను రాజకీయంగా వాడుకున్నారే తప్ప బీసీల గుణగణన చేసి రాజ్యాధికారంలో బీసీలకు రావాల్సిన వాటా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, శ్రీమతి సోనియా గాంధీ, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే  సారథ్యంలో, వారి సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్రంలో, ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ్యులకు  తిరుపతి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.