111జీవో రద్దు చేసిన సీఎం కేేసీఆర్‌కు ధన్యవాదాలు

నవతెలంగాణ-శంషాబాద్‌
111 జీవో రద్దు చేసి శంషాబాద్‌తో పాటు 84 గ్రామాల అభివద్ధికి బాటలు వేశారని సీఎం కేసీఆర్‌కు శంషాబాద్‌ బీఆర్‌ఎస్‌ నేతలు ధన్యవాదాలు తెలిపారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌, ఎంపీ గడ్డం రంజి త్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్‌ను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషాబా ద్‌ ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్‌, జడ్పీటీసీ నీరటి తన్విరాజు ముదిరాజ్‌, శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కే.సుష్మామహేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బండి గోపాల్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కే.చంద్రారెడ్డి, పట్ట ణ అధ్యక్షులు దూడల వెంకటేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.