సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు

సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు– హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రావు
హైదరాబాద్‌ : రాష్ట్రంలో యువతని క్రీడల వైపు ప్రోత్సహించే విధంగా, ఉత్తమ క్రీడాకారులను తీర్చిద్దిదే క్రమంలో భాగంగా ముచ్చెర్ల లో స్పోర్ట్స్‌ హబ్‌, అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మాణంకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని హెచ్‌ సి ఏ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌ మోహన్‌ రావు అన్నారు. ఇటీవల హెచ్‌ సి ఏ చేసిన విజ్ఞప్తిని గౌరవించి 100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్‌ మైదానాన్ని నిర్మిస్తామని, జిల్లాలలో క్రికెట్‌ మైదానాలను నిర్మిస్తామని తెలిపినందుకు రాష్ట్రంలోని క్రికెట్‌ అభిమానుల తరపున ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అరిశనపల్లి జగన్‌ మోహన్‌ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.