– రిజర్వేషన్ సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో: దళిత క్రైస్తవులకు ఎస్సీ హౌదా కల్పనపై సానుకూలంగా స్పందించి మ్యాని ఫెస్టోలో హామీ ఇచ్చినందుకు సీపీఐ(ఎం)కు దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బుధవారం సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల పోచయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. మిగిలిన రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో స్పష్టమైన హామీ ఇవ్వాలని, దళితుల హక్కులను కాపాడాలని పేర్కొన్నారు.