యాత్ర విజయవంతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

– హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షులు డా. ఎన్‌. గౌతమ్‌ రావు
నవతెలంగాణ-అంబర్‌పేట
విజయ సంకల్ప యాత్రతో బీజేపీ ప్రజల మధ్యకు వెళ్ళి వారి సమస్యలను గుర్తిస్తుందని బీజేపీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షులు డా. ఎన్‌. గౌతమ్‌ రావు అన్నారు. యాత్ర విజయవంతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా గౌతమ్‌రావు మాట్లాడుతూ వచ్చే నెల 1వ తేదీన జరగాల్సిన ముగింపు యాత్ర వచ్చే నెల 2 వ తేదీకి వాయిదా పడిందని అన్నారు. వచ్చే నెల 2వ తేదీన వై.ఎమ్‌.సీ.ఏ చౌరస్తా నుండి చెప్పుల బజార్‌, టూరిస్ట్‌ హౌటల్‌, బర్కత్‌ పుర చమాన్‌, ఫీవర్‌ హాస్పిటల్‌, పటేల్‌ నగర్‌ చౌరస్తా మీదుగా విజయ సంకల్ప యాత్ర వెళ్ళి శ్రీ. రమణ టాకీస్‌ వద్ద సాయంత్రం 06:30 గంటలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని యాత్రల ముగింపు సభ ఉంటుందని తెలిపారు. వచ్చే లోకసభ ఎన్నికలలో సికింద్రాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతుందని ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా స్పష్టమైందని అన్నారు.