
నవ తెలంగాణ- మల్హర్ రావు
తనను ఆశీర్వదించి మరొక్కసారి మంథని నియోజకవర్గ శాసనసభ్యునిగా,రాష్ట్ర మంత్రిగా అవకాశం వచ్చిన నేపథ్యంలో ఓటువేసి ఆశీర్వదించిన మంథని నియోజకవర్గ అక్కకి,చెల్లికి,అన్నకి, తమ్ముడికి,కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలని,అలాగే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడవాలని చూసిన వారిని మర్చిపోలేనని వారెవరో పేరుపేరునా తెలుసని,ప్రజా ఆశీర్వాదంతోనే ఉన్నత పదవి పొందానని,అందరి సహకారంతో భారీ మెజార్టీ వచ్చిందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మండలానికి విచ్చేసిన ఆయనకు అడుగడుగునా పూల వర్షంతో ప్రజలు ఘనస్వాగతం పలికి,నాగులమ్మ నుంచి కొయ్యుర్ వరకు ద్విచక్ర వాహనాలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కొయ్యుర్ తన తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుచ తప్పకుండా అమలు చేస్తోందన్నారు.ఇప్పటికే ప్రభుత్వం రెండు గ్యారంటీలు అమలు చేసిందని,త్వరలో మిగతావి అమలు చేస్తోందన్నారు.ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరుతాయని,ఎవరు పైరవీలు,లంచాలు కానీ ఇవ్వొద్దన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు, బొమ్మ రమేష్ రెడ్డి,సంగ్గెం రమేష్,ఎంపిటిసి ఏనుగు నాగరాని,జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, జంగిడి సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి,మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,ప్రధాన కార్యదర్శి వేల్పుల రవి,కేశారపు చెంద్రయ్య,ఇందారపు చెంద్రయ్య, ప్రభాకర్,రాజా సమ్మయ్య పాల్గొన్నారు.