– తెలంగాణ నర్సెస్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సహజ ప్రసవాలను చేయడంలో ప్రతిభ కనబరిచిన నర్సింగ్ ఆఫీసర్లకు ప్రోత్సాహకం విడుదల చేసినందుకు తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ లక్ష్మణ్ రుఢావత్ ఒక ప్రకటన విడుదల చేశారు. నర్సింగ్ ఆఫీసర్లను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.