ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు: వినోద్

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
నిజాంబాద్ రూరల్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ చేయించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి కి జక్రాన్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కృతజ్ఞతలు తెలియజేశారు‌. జక్రాన్ పల్లి మండల్ పేదల సంక్షేమమ్ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో జక్రాన్ పల్లి మండల్ లో  సిసి రోడ్లు నిర్మించుకోవడం జరిగిందని జక్రాన్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు సొప్పరీ  వినోద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం యాదాద్రి రాముడు సన్నిధిలో ముఖ్యమంత్రి ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు .ప్రతి నియోజకవర్గంలో పేదలకు 3500 ఇండ్లు ను అందిస్తామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారని  అన్నారు . గత పాలకుల రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో ఆరు లక్షల 71 వేల కోట్లు అప్పులు చేశారని, బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ ఒక కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. 200యూనిట్లు విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి ధార బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళల వడ్డీ లేని రుణాలు ఇదివరకే రూ.1500 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని కాంగ్రెస్ హయాంలో ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారని,  జక్రాన్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు సొప్పరీ వినోద్ అన్నారు.