‘రూల్స్ రంజన్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమా. ప్రేమ నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా రూపొందించి మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు నింపడానికి చేసిన ప్రయత్నమిది. ఇది విడుదలైనప్పటి నుండి ప్రేమతో ముంచెత్తినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులం దరికీ కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను’ అని దర్శకుడు రత్నం కృష్ణ తెలిపారు. కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ దర్శకుడు రత్నం కృష్ణ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘నటీనటులు, సాంకేతిక నిపుణులు, నా నిర్మాతలు, నా అసిస్టెంట్లు ఇలా మొత్తం టీమ్ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. భవిష్యత్తులో మంచి కథలతో మిమ్మల్ని మరింత అలరిస్తాను’ అని రత్నం కష్ణ తెలిపారు.