ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌

ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కష్ణ హీరోయిన్‌గా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌.ఎల్‌. ఎస్‌. క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిం చిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ,’ మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేం నిర్మించే చిత్రాల నుంచి వచ్చే డబ్బులో కొంత భాగాన్ని ఉపకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ సినిమాను తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయబోతున్నాం. త్వరలోనే చెన్నైలో ప్రమోషన్‌ స్టార్ట్‌ చేస్తాం. హిందీలో విడుదల చేయటానికి జీఎంఆర్‌ గ్రూపు హక్కులు అడిగింది. మేము తీసిన ‘కంచర్ల’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నాం’ అని అన్నారు.
‘నేను హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేసినప్పుడు మా నాన్న, ఆయన బందం అండగా నిలిచారు. నేను హీరోగా ప్రేక్షకులకు డైరెక్ట్‌గా కనెక్ట్‌ కావడంతో అందరూ నన్ను గుర్తుపట్టి అభినందిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మేం పడ్డ కష్టానికి ఈ విజయం బూస్టప్‌ ఇచ్చింది’ అని హీరో ఉపేంద్ర చెప్పారు. దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. మాట్లాడుతూ,’ప్రేక్షకులకు కావాల్సిన అంశాలతో పాటు కొంత సందేశాత్మక పాయింట్‌ను కూడా ఇందులో ఆవిష్కరించాం. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’ అని తెలిపారు.